అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి, పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు కొంపల్లి, దుండిగల్, నిజాంపేట్ పరిధిలోని అభివృద్ధి పనులు, సమస్యలపై కమీషనర్లు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు మాట్లాడుతూ అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరించాలని, మూడు మున్సిపాలిటీ పరిధిలో  నిధులు మంజూరై పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేయాలని అన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు వర్షపు నీరు మల్లింపు, రోడ్లపై ప్రత్యేక దృష్టి వహించి చర్యలు చేపట్టాలని,  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయా సమస్యల   శాశ్వత పరిష్కారాల దిశగా అధికారులు పని చేయాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి కమీషనర్ జ్యోతి, దుండిగల్ కమీషనర్ సురేష్, నిజాంపేట్ కమీషనర్ ముకుంద్ రెడ్డి, ఏఈలు శ్రీనివాస్ రావు, వైశ్యాం పాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు.