మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం డివిజన్ సర్వే నంబర్ 56 న్యూ శివాలయనగర్ లోని నల్ల పోచమ్మ దేవాలయ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించి చర్యలు చేపట్టాలంటూ న్యూ శివాలయనగర్ కాలనీవాసులు కుద్బుల్లాపూర్ మండల కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి ఉన్నటువంటి దేవాలయ స్థలాన్ని కొంతమంది భూకబ్జాదారులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిని తొలగించి దేవాలయ స్థలాన్ని కాపాడాలన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ త్వరలోనే చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు .ఈ కార్యక్రమంలో శివాలయనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ ,ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజలింగం ,దొడ్ల శ్రీను ,వెంకటేశ్ బొట్టు లక్ష్మణ్,క్రిష్టయ్య, చౌడయ్య ,వీరేశం ,మూర్తి ,తేజ మహిళలు భారతి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నల్ల పోచమ్మ దేవాలయ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించాలి