ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ మువ్వ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు ఆపడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లను నిర్మించాలని, జర్నలిస్టు కార్డులతో సంబంధం లేకుండా వైద్య సదుపాయం కల్పించాలని కోరారు.ప్రతి ఒక్క జర్నలిస్టు లకు ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ